ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆపద మిత్ర శిక్షణతో సామాజిక సేవకు సిద్ధమైన వాలంటీర్లు

కరీంనగర్,అర్జున్ సమాచారం:

ఆపద సమయంలో తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేలా వాలంటీర్లను తీర్చిదిద్దడమే ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహించిన వారం రోజుల శిక్షణలో విపత్తుల సమయంలో జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, శిక్షణను కేవలం సర్టిఫికెట్‌కే పరిమితం చేయకుండా అవసరమైన సమయంలో ప్రజలకు సహాయం చేయాలని అన్నారు. ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి 67 మంది వాలంటీర్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ గౌరవ అధ్యక్షులు సురేందర్ రెడ్డి తదితరులు వాలంటీర్లను అభినందించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కిట్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అర్జున్, ఎలిజబెత్ రాణి, రాజేందర్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.